ఐక్యత ఒక బలం | unity is a strength
కథ:
ఒక ఊర్లో వేటగాడు ఉండేవాడు. ఎప్పటి లాగానే ఆ రోజు కూడా వేటకు బయలు దేరాడు. కానీ ఆ రోజు ఏ జంతువు తన వేటకు చుక్కలేదు. రోజంతా తిరిగి తిరిగి అలసి పోయిన వేటగాడు. సాయంత్రానికి ఒక ఆలోచన చేసాడు.
ఒక చెట్టు దగ్గర్లో సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించేందుకు విత్తనాలను చల్లాడు. తర్వాత వలని దూరం నుంచి గమనించసాగాడు.
ఇంతలో అటునుంచి ఎగురుతున్న పక్షుల గుంపు విత్తనాలను గమనించాయి. వెంటనే గుంపంతా ఇటు వైపు రావడం మొదలుపెట్టాయి.
హాయిగా కింద పడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకున్న వలని గమనించాయి. వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు సంతోషించాడు.
మరోవైపు, భయముతో ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షులు ఎగరలేకపోతున్నాయి. అప్పుడు ఆ పక్షులు లోని ఒక పక్షి ఇలా అన్నది ” మనమందరం వేటగాడి వలలో పడ్డాము ఇప్పుడు ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నము. ఇప్పుడు మన ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి”
ఇప్పుడు మిగతా పక్షులు ఎన్టీ ఆ నిర్ణయం అని అడిగాయి. వీటికి సమాధానం మరో పక్షి ఇలా చెప్పండి. “ఒంటరిగా ఎగరలేని మనం, అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలని రక్షించుకోవచ్చు”
వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి. అనుకున్నట్టుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతో పాటు గాలిలోకి ఎగిరి పోయాయి. దీంతో తమ ప్రాణాలను రక్షించు కున్నాయి పక్షులు.
వెంటనే ఆ పక్షులు ఎగరడం గమనించిన వేటగాడు. ఐక్యమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇలా వేటగాడు బారినుండి తప్పించుకుని పక్షులు.
ఈ కథలోని నీతి:
ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.