Ashada Masam In Telugu | ఆషాడ మాసం విశిష్టత

Ashada Masam In Telugu | ఆషాడ మాసం విశిష్టత
Spread the love

Ashada Masam Start and End Date In 2020:

Ashada Masam Start Date: 22 – June – 2020

Ashada Masam End Date: 20 – July- 2020

Ashada Masam Meaning/ ఆషాడ మాసం విశిష్టత:

తెలుగు నేలలో నాలుగవ నెల ఆషాడమాసం. ఈ మాసాన్ని శూన్య మాసం అంటారు ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జరుపుకోరు, కానీ ఈ నెలకు ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి.

జగజ్జనడు అయిన పూరి జగన్నాథుని రథయాత్ర ఈ నెలలోనే జరుగును. తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ ఆషాడ మాసం అంతా జరుపుకుంటారు.అమ్మవారి ఆలయాలు, అందంగా అలంకరిస్తారు.

ఆషాడ మాసం బోనాలు:

మహిళలు బోనాలను తలపై ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు పల్లెల్లో గ్రామ దేవతలను పూజిస్తారు.

ఈ నెలలో అమ్మవార్లకు శాకంబరి ఉత్సవాలు జరుపుతారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతర ఎంతో గొప్పగా జరుపుకుంటారు.

తొలి ఏకాదశి విష్ణు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ. దక్షిణాయనం ఈరోజు నుండి ప్రారంభమగును. ఆషాఢ పూర్ణిమ(వ్యాస పూర్ణిమ) ఈ నెలలోనే వచ్చును. వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపినవారు గురువు. వేదవ్యాసుడు లోకానికి జ్ఞానవాహిని చూపినవారు.

కొత్తగా వివాహం చేసుకున్న జంట కోసం ఆషాడా మసం:

ఈ నెలలో తప్పకుండా మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు ఆయుర్వేద ప్రకారం. క్రిమికీటకాలు నశిస్తాయని భావన. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. ఈ నెలంతా పుట్టింట్లోనే ఉంటారు.

ఆషాడంతో రైతు సంబంధ:

ఈ నెలలో తొలకరి జల్లులు పడతాయి రైతులు పొలం పనులలో నిమగ్నమవుతారు నేలంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. వర్షాకాలం కావడం చేత దోమలు ఈగలు మొదలగు క్రిమికీటకాలు వలన రకరకాల జబ్బులు వస్తాయి. వాటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

Sudha

Sudha is a homemaker. Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories in this blog for children.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2020 - Telugu Stories