కుందేలు మరియు తాబేలు | Rabbit and Tortoise
కుందేలు మరియు తాబేలు కథ:
ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి.వారిద్దరూ చాలా ఆడతారు,ఒక రోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది.
“నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడి కైనా వెళ్ళ గలవా?” అని వెటకారం చేసింది. “నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది.
తాబేలు పరుగు పందెం ఆడ డానికి ఒప్పుకుంది.
నిర్ణయించిన రోజు కుందేలు, తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి. కుందేలు మహా ధైర్యంగా, గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. మన తాబేలు అనుకువగా, వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది.
కోతి ని పథక కర్త గా ఎంచుకున్నారు. కోతి “వన్, టూ, థ్రీ…” అనంగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్ లో రేగుకుంటూ సాగింది.
కొంచం దూరం పరిగేట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించ లేదు. అసలు తాబేలు నెగ్గే ప్రశక్తే లేదు – ఎందుకు కష్ట పడడం? నిద్రపోయి, లేచి, సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు, అనుకుంది. ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది.
కొంత సేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ, నిదానంగా, చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దేగ్గిరకి చేరుకుంది.
తాబేలు ముగింపు గీత దెగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది. తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కాని, కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి, పోటి నేగ్గేసింది.
చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగడ్తలతో అభినందించారు.
మన బలాన్ని ఎక్కువ, ఇతర్ల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు.
కథ యొక్క నీతి:
ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి మరియు విజయవంతం కావడానికి మీ మార్గంలో విశ్రాంతి తీసుకోండి.