మహాత్మా గాంధీ జయంతి | Gandhi Jayanti In Essay Telugu
జాతిపిత మహాత్మా గాంధీ
అక్టోబర్ 2, ఒక స్వాతంత్ర యోధుడు పుట్టిన రోజు అతడే “మహాత్మా గాంధీ”. గాంధీజీ పుట్టిన రోజుని “గాంధీ జయంతిగా” జరుపుకుంటారు. అందరు ప్రేమగా “బాపూజి” అని పిలుస్తారు. ప్రపంచానికి సత్యా మరియు అహింసా అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడు గాంధీ. దేశం అంతా ఏకమై తెల్లవాలని తరిమికొట్టి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన వాలలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. బాపూజీ భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రపంచ దేశాలకు గాంధీయిజం ఒక గొప్ప పాటమైంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గాంధీజీని అందరూ “జాతిపిత”గా పిలిచారు
బాల్యం
గాంధీజీ అక్టోబర్ 2 1869 గుజరాత్ రాష్ట్రంలోని కథియవాడ్ జిల్లాలోని పోరుబందర్ లో జన్మించాడు. మహాత్మా గాంధీ అసలు పేరు “మోహన్ దాస్ కరంచంద్ గాంధీ”. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ, పోరుబందర్ లో రాజకీయ నాయకుడు. తల్లి పేరు పుతిలిబాయ్, ఉత్తమ గృహిణి. చిన్నతనంలో అతడు చూసిన హరిశ్చంద్ర నాటకం అతడి వ్యక్తిత్వంపై చాలా ప్రభావం చూపింది. ఆ నాటకం చూసిననాటి నుండి సత్యానికి కట్టుబడి ఉన్నాడు. తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణతో పెంచారు. గాంధీ 1887లో మెట్రిక్క్యులేషన్ ను పూర్తిచేశారు. 19 ఏళ్ల వయసులోనే గాంధీజీ బారిష్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లారు. గాంధీజీకి 1896లో కస్తూర్బాతో వివాహం జరిగింది. బారిష్టర్ పూర్తిచేసి ఇంగ్లాండ్ నుండి తిరిగొచ్చిన తరువాత దక్షిణాఫ్రికాలో లా ప్రాక్టీస్ చేశారు.
స్వాతంత్ర పోరాటం
ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్రం సాదించిన ఎందరో మహానుభావులలో గాంధీజీ అగ్ర స్థానంలో ఉన్నారు. అందరు అభిమానించే, ఆదరించే గొప్ప వ్యక్తి గాంధీ. 1914లో గాంధీజీ తిరిగి భారత దేశంకి వచ్చిన సమయంలో పూర్తి భారత దేశం బ్రిటిష్ పరిపాలనలో అష్టకష్టాలతో ఉంది. 1930లో ఉప్పు సత్యాగ్రహం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో ఎందరో స్వాతంత్ర యోధులు పాలుగొన్నరు. గాంధీజీ ఉప్పుపై పన్నుకి వ్యతిరేకిస్తు ఈ ఉధ్యమాన్ని మొదలుపెట్టారు. 400 కిలోమీటర్లు దండి మార్చ్ చేశారు. 1942లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ పోరాటానికి నాయకుడిగా వ్యవహరించారు. 40 ఏళ్ల సుధీర్గ పోరాటంతో బ్రిటీషర్లు దదిగివచ్చి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు. 1947లో ఆంగ్లేయులు దేశాన్ని విడిచి వెళ్ళడంతో దేశానికి స్వాతంత్రం వచ్చింది.
బాపూజీ మరణం
1948 జనవరి 30న ఢిల్లీలో బిర్లా నివాసం వద్ధ ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా గాంధీజీని చంపేసారు. నాథురామ్ గాడ్సే అనె ఒక వ్యక్తి గాంధీజీని తుపాకీతో కాల్చి చంపాడు. హే రామ్ అంటూ అతని స్వాశ విడిచాడు. గాంధీజీ సిద్ధాంతాలు నేటి పాలకులకు, ప్రజలకు ఎంతో స్పూర్తిదాయకం.