సామెతలు | Funny Quotes In Telugu For Friends

సామెతలు | Funny Quotes In Telugu For Friends
Spread the love
  1. అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని.
  2.  ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.
  3. ఐశ్వర్యానికి అంతం లేదన్నట్లు.
  4.  ఒక ఒరలో రెండు కత్తులు  ఇమడవు కదా !
  5. ఒక చెయ్యి తట్టితే చప్పుడు అవుతుందా!
  6.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
  7.  ఇంటిలో ఈగల మోత బయట పల్లకి మోత.
  8.  ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. 
  9. ఇంట్లో పులి వీధిలో పిల్లి.
  10. ఈతకాయతో తాటికాయ.
  11.  అదిగో తోక అంటే ఇదిగో పులి.
  12.  అందితే సిగ అందకపోతే కాళ్లు .
  13. అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి.
  14.  అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తే వాడోకడు .
  15. ఉడత ఊపులకు కాయలు రాలునా?
  16.  ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
  17.  ఎంత వారలైన కాంతదాసులే.
  18.  ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య.
  19.  ఎద్దు పుండు కాకికి ముద్దా!
  20.  ఎర్రను చూపి చేపను లాగినట్టు.
  21.  ఎవరి వెర్రీ వారికి ఆనందం.
  22.  ఎవరికి వారే యమునా తీరే.
  23.  ఎద్దును అడిగా గంత కట్టేది?
  24. ఏ ఎండకి ఆ గొడుగు ఏ గాలికి ఆ చేప.
  25.   ఏకు అయి వచ్చి మేకు అయిన తీరు.
  26.  కొరివితో తల గోక్కున్నట్టు.
  27.  కన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ.
  28.  కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డట్టు.

Sudha

Sudha is a homemaker. Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories in this blog for children.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2020 - Telugu Stories