Telugu Moral stories – నీతి కథలు
Story 1. Clever Tortoise Story/తెలివైన తాబేలు:
ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.
ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది.
వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది.
తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది.
ఊపిరి బిగపట్టుకొని ఉన్నది ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంస మైనా తినలేవు అంది తాబేలు.
ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను,
మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడ్డ తాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.
అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మి అన్నట్టుగానే తల ఊపింది తాబేలు ను నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పి పెట్టింది.
కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ నేను పూర్తిగా నాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది.
దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.
Story 2. Cunning Fox Story/దురాశ నక్క:
గోపాల పురానికి చెందిన కొంత మంది పిల్లలు పక్కనున్న అడవికి ఆవులను మేపడానికి వెళ్లేవారు మధ్యాహ్నం అక్కడే భోజనం కోసం
సద్ది మూట తీసుకు పోయే వారు సాయంత్రానికి ఆవుల తో ఇంటికి వచ్చేవారు. ఆ అడవిలో పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ చెట్టు తొర్రలో తమ ఆహారాన్ని దాచుకునేవారు పిల్లలు.
ఆకలేసినప్పుడు వచ్చి ఆహారాన్ని అందరూ పంచుకుని తినేవారు. ఒకరోజు ఒక నక్క కి బాగా ఆకలి వేసింది ఆహారాన్ని వెతుక్కుంటూ మర్రిచెట్టు దగ్గరికి వచ్చింది.
తొర్ర లోంచి గుమ గుమ వాసనలు నక్క ముక్కు తాకాయి ఇంకేముంది, పుట్టలోకి దూరింది ఆహారాన్ని తిన సాగింది.
ఆకలి తీరిన ఆగకుండా అత్యాశ కొద్దీ నలుగురికి సరిపడా ఆహారాన్ని తనే తినేసింది. నక్క పొట్ట బనాల తయారైంది.
తొర్ర లోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా మెడ వరకు మాత్రమే బయట పెట్టగలిగింది బాణా లాంటి పొట్ట త్వరలో ఈ యొక్క పోయింది.
ఆహారమంతా అడిగి పుట్ట తగ్గితే గానీ బయటకు రాలేనని అర్థమైంది నక్కకి ఇంతలో పిల్లలు, ఆకలేసీ భోజనం తిందామని మర్రిచెట్టు దగ్గరకు వచ్చారు.
తొర్రలో నక్కను చూసి ఆశ్చర్యపోయారు వాడికి విషయం అర్థమైంది. నలుగురు పిల్లలు కలిసి నక్క ను బయటకు లాగి నాలుగు దెబ్బలు తగిలించారు.
అత్యాశతో కోరి కష్టాలు తెచ్చుకున్నాను అనుకుంది నక్క.
Story 3: Rat and Frog Story/ చెడ్డ స్నేహితుడు:
ఒక అడవిలోని నది ఒడ్డున చెట్టు దగ్గర గెలుపు ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది. నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలన్నీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది.
ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంట ని తినాలనుకుంటే ఎలుక కానీ, నదిని దాటి వెళ్లడానికి దానికి ఈత రాదు.
నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక. నువ్వు నువ్వు బరువు నా వీపు మీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరము మునిగిపోతాం. అని బదులిచ్చింది కప్ప.
కానీ ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకునే ఎలుక నీ కాలికి నా కాలికి, ఒక తాడు ని కడతాను. నువ్వు ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది వెనుక మిత్రుడి మాటను కాదనలేక కరీం అంది కప్ప.
ఎలుక తన కాలుని కప్ప కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకిన. అంతే ఎలుక బరువుగా ఉండటం తో అందులో మునిగి పోయే పరిస్థితి వచ్చింది.
అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి చూసింది. కప్ప నీటిలోకి లాగింది. అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగ దాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది.
ఎలక తో పాటే దాని కాలికి తాడుతో కట్టుకున్నా తప్ప కూడా పైకి వచ్చింది. అది చూసిన కొంగ ఆహా ఏమి అదృష్టం అని సంబరపడింది.
ఎలుకని నది అవతల కి తీసుకొని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసి కూడా మొహమాటానికి పోయి పోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎంతో దుఃఖించింది కప్ప
Story 4: Crow and Sparrow Story/ కాకి గర్వం:
అనగనగా ఒక చిట్టడవి లో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరుని మిడిసి పడుతుండేది.
ఓ రోజు కాకి ఏమి ఉబుసు పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్నా పిచ్చుక ని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంటినట్టే ఉంది. అని వేళాకోళ మాడింది.
ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీ లాగే ఎగరాలి సీనా అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్లది అన్నది అయితే.
నాతో పందెం కాసి మీ సామర్థ్యం తో ‘నన్ను ఓడించు చూద్దాం’! అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న అక్కడున్న న్యాయనిర్ణేతగా ఉంటా మన్నాయి.
ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు తో ఉన్న మద్ది చెట్టు తో మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిచెట్టు ను దాటుకుని మళ్లీ ఇక్కడికి రావాలి. ముందుకొచ్చే వాళ్లే విజేత. అని ప్రకటించాయి.
పందెం మొదలైందో లేదో కాకి సరున రావి చెట్టును దాటి మర్రి చెట్టు లోకి దూసుకెళ్లింది ఆ మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతొ దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు, సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడి పోయింది.
పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లో కి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది.
పిచ్చుక కోరికమేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడూ గర్భ పడలేదు. ఎవడిని ఇబ్బంది పెట్టలేదు.
Story 5. Cat and Bell Story/పిల్లి మెడలో గంట:
ఒక వ్యాపారి ఇంట్లో చాలా ఎలుకలు ఉండే వి. అవి దాన్యం సంచులకు రంధ్రాలు చేసి ధాన్యాన్ని అంతా పాడు చేసేవి.
వ్యాపారి ఎలుకల బాధ నుండి తప్పించుకో డానికి ఒక పిల్లిని పెంచాడు. అది రోజు ఎలుకలను పట్టుకుని తినేది.
దాన్ని చూసి ఎలుకలు భయపడే వి. పిల్లి నుండి రక్షించుకోవటానికి ఎలుకల అనీ ఒక దగ్గర సమావేశం అయ్యాయి.
అందులో నుంచి ఒక ఎలుక పిల్లి మెడలో గంట కడితే ఆ ధ్వనికి మనం పిల్లి వస్తుందని తెలుసుకొని చాటు గా ఉండవచ్చు. అని చెప్పింది.
కానీ మిగతా యాలుకలు పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనిపించుకున్నాయి. ఎవరు కట్టలేకపోయారు.
నీతి: కాని పని గురించి చర్చించుకుని సమయం వృధా చేయొద్దు.