దురాశ కథ | Poor Women Greed Story
Durasa Story in Telugu with Moral (Bangaru Hamsa Katha):
కథ:
పంచమ అనే ఒక రాజ్యం కలదు, ఆ రాజ్యములోని అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక హంస ఉండేది. మిగతా ఏ ప్రాణులు ఉండేవి కావు.
ఆ సరస్సులోని హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి గత జన్మ రహస్యాలన్నీ తెలుసు.
పక్కనే ఉన్న ఊరు నుండి ఓ పేద రాలు కట్టెలు ఎరుకోవడానికి అడవికి వచ్చింది. దూప కావడం వలన ఆ పేదరాలు సరస్సు దగ్గరికి వెళ్ళింది.
ఆమెను చూసిన హంస వెంటనే నీకు ఒక రహస్యం చెబుతాను నీవు ఇక్కడకు రా! అని పిలిచింది.
పేదరాలి తో హంసా ఇలా చెప్పింది నేను నీ భర్తని చనిపోయాక హంస జన్మ ఎత్తినట్లు చెప్పింది.
భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస, రోజుకు ఒక బంగారు ఈకను సృష్టించి ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది హంస పేదరాలి తో.
అలానే తీసుకుంది పేదరాలు కొద్దిరోజుల్లోనే ఆమె ధనవంతురాలు అయిపోయింది. పెద్ద ఇల్లు కట్టుకుని బిడ్డలతో సంతోషంగా ఉంది.
కొన్ని రోజులకు ఒక దురాశ కలిగింది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది. అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మళ్లీ కొత్త ఈకలు పుడతాయి అనుకుంది మనసులో.
వెంటనే హంస ఎంత చెప్పినా వినకుండా ఈ ఈకలన్నీ తీసుకుంది. ఆ ఈకలు బూడిదలా మారాయి, బంగారం సృష్టించే శక్తిని కోల్పోయింది హంస మళ్లీ ఆమె పేదరాలి గా మారింది.
ఈ కథలోని నీతి|Moral of the Story:
దురాశ వలన గొప్పవారు కాలేరు.
Amazing stories