చిలిపి కథ | Short Funny Story

చిలిపి కథ
ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది. బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది. అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత కంప్లైంటు ఇస్తుంది.
అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయ అంత అమీనును తోలుకొని లవంగమంత లాటి తీసుకొని పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడిలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేస్తాడు.
మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు.