తెలివైన కాకి మరియు పాము | Clever Crow and Snake
కథ
అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది, ఆ చెరువు ఒడ్డున ఒక మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కాకుల జంట గూడుకట్టుకుంది. ఆ కాకుల జంట గుడ్లు పెట్టేది. చెట్టు కింద పాము పుట్టలో ఒక పాము ఉండేది. కాకి గుడ్లు పెట్టి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు ఉండేది కాదు, రోజూ అలానే జరిగేది.
ఒకరోజు కాకుల జంట పక్కనున్న వేరొక చెట్టుపైనుండి తమ గుడ్లు ఏమై తున్నాయని గమనించాయి. అదే సమయానికి పుట్టలో నుండి ఒక పాము మెల్లగా చెట్టు పైకి ఎక్కి గుడ్లు తినడం చూశాయి ఆ కాకుల జంట. తన గుడ్లను ఆ పాము నుండి కాపాడుకుని పిల్లలను చేయాలని దానికి ఏదైనా మార్గం కనిపెట్టాలని అనుకున్నాయి ఆ కాకులు.
ఒకరోజు చెరువులో ఈత కొట్టడానికి మునసబుగారి పిల్లలు వచ్చారు. వాళ్లు ఒంటి పైన ఉన్న నగలను తీసి చెరువు గట్టు పైన పెట్టి చెరువులోకి దిగారు ఆ పిల్లలు. ఆ నగలను చూసిన కాకుల జంట ఉపాయం ఆలోచించాయి. వారు చూస్తుండగా నగల దగ్గరికి వచ్చి ఒక కాకి కావ్ కావ్ మని అరిచి ఒక బంగారు నగను నోట్లోపెట్టుకొని పుట్టలోకి విడిచింది. వెంటనే ఆ పిల్లలు వెళ్లి మునసబు గారి తో కాకి నగను పుట్టలోకి విడిచిన విషయం చెప్పారు.
వెంటనే మునసబుగారు తన పని వాళ్లకు పుట్టని తవ్వి, నగ తీసుకు రమ్మని చెప్పాడు. ఆ పని వాళ్లు పలుగు పార పట్టుకొని వెళ్లారు. ఆ పుట్టను తవ్వుతుండగా పాము బయటకు వచ్చింది. దానిని వెంటనే చంపారు ఆ పని వాళ్ళు. చెట్టు పైన ఉన్న కాకుల పామును చంపడం చూసి సంతోష పడ్డాయి.
ఈరోజు నుండి మనము గుడ్లు పెట్టి పిల్లలను చేయవచ్చు అనుకున్నాయి కాకులు. ఆ పాము బాధ నుండి విముక్తి పొందిన కాకులు హాయిగా ఉండ సాగాయి.
ఈ కథలోని నీతి
ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు.
Great blog you’ve got here.. It’s difficult to find
high quality writing like yours these days. I honestly appreciate people like you!
Take care!!