Dussehra Festival In Telugu | దసరా పండగ చరిత్ర
When Is Dussehra in 2022?
Dussehra is on Wednesday, October 5 in 2022
హిందూ సంస్కృతిలో అనేక సంప్రధాయలు మరియు పండుగలు ఉన్నాయి. మన తెలుగు సంప్రదాయంలో ముఖ్యమయిన పండుగలలో దసరా ఒకటి.దశ అంటే పధి హర అంటే ఓటమి, దశమి రోజు అధర్మానికి జరిగిన ఓటమి అని అర్థం. దసరా అంటే దేవి శరన్నవరాత్రుల పండగ. శరధృతువు ఆరంభంలో వచ్చే పండగ కాబట్ట కనుక ఈ పేరు. ఈ పండగ సమయం లో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు జరిగే దుర్గా దేవి ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలు లేదా దసరా అని పిలుస్తాము.
దసరా పండగ చరిత్ర:
దసరా పండగకు ఒక ప్రాముఖ్యమయిన చరిత్ర ఉంది. ఈ చరిత్ర ని అందరు తెలుసుకోవాలి. ఆ చరిత్ర యొక్క మొదటి కథ మహిషాసుర మర్ధన. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ముల్లోకాలను జయించాలనే ధుర్బుద్ధి ఉండేది. అతని తపస్సుతో బ్రహ్మ దేవుడిని ప్రత్యేక్షం చేసుకొని ఏ పురుషుని చేతిలోను మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు. ఆ వరం కారణంగా దేవతలను,ప్రజలను హింసించగా అందరు దేవతలు,త్రిమూర్తులు ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే దుర్గా మాతగా అవతరించింది. దుర్గా దేవి మహిషాసురుడితో తొమిది రోజులు యుధం చేసి అతన్ని వధించింది. అందుకే ఈ పండగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. పదవ రోజున విజయదశమిగా జరుపుకుంటారు. ఈ చరిత్ర యొక్క రెండవ కథ, రావణ సంహారం. రామ రావణ మధ్య జరిగిన యుధంలో రాముడు రావణుని వధ చేసి విజయం జయించినందువలన ఈ పండగను విజయదశమి అని కూడా అంటారు.
దసరా పండగ విశిష్టత:
హిందువులు ఎంతో ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. అందరు నూతన వస్త్రాలు దరిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. తెలంగాణలో ఈ నవరాత్రులలో స్త్రీలు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మను గౌరమ్మగా కొలుస్తారు. బతుకమ్మ సంబరాలు అమావాస్యతో ప్రారంబమయి సద్ధుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణలో స్త్రీలు ఎంతో ఆనందంగా,కోలాటాలతో జరుపుకుంటారు. దసరా రోజు సాయంకాలం అందరు జమ్మి చెట్టుని పూజిస్తారు, ఎందుకంటే పాండవులు వనవాసం వెళ్తూ జెమ్మి చెట్టుపై తమ ఆయుదాలను తిరిగి తీసిన రోజు. దసరా రోజున పాలపిట్టని చూడటం శుభంగా భావిస్తారు. పాలపిట్టని మన రాస్ట్రియ పక్షిగా గుర్తించారు.