Children’s Day Speech In Telugu | బాలల దినోత్సవం
బాలల దినోత్సవం | Importance of Children’s Day in Telugu
“నేటి బాలలే రేపటి పౌరులు అంటారు“, అందుకే ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. నవంబరు మాసం అంటేనే బాలలకు పండగ మాసం. ఈ నెలలో అంతర్జాతియ బాలల చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. స్వాతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాము, ఎందుకు అంటే ఆయినకి పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు భావి భారత భావిష్యత్తు పౌరులు అని అందరూ నమ్ముతారు.
జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశ మొదటి ప్రధాన మంత్రి. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. పిల్లలు అందరూ ప్రేమతో ఆయినని “చాచా నెహ్రూ” అని పిలుస్తారు. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకే పలు చర్యలు చేపట్టడం ఈ “ చిల్డ్రన్స్ డే లక్ష్యం. స్వాతంత్రానికి ముందు నవంబరు 20న బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు, కాని నెహ్రూ గారు మరణించిన తర్వాత ఆయిన పుట్టిన రోజున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
బాలల దినోత్సవాన్ని పాటశాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు. పిల్లలకు ఇష్టమైన స్వీట్లు, చాక్లెట్లు, కానుకలు పంచిపెడతారు. పాటశాలలో బాలల దినోత్సవం రోజున ఎన్నో పోటీలు నిర్వహిస్తారు. మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజెస్తారు. పిలల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా పాటశాలలు పది రోజుల ముందు నుంచే ఈ వేడుకలను నిర్వహిస్తారు. మన దేశ బావిష్యత్తు మన పిల్లల చేతుల్లోనే ఉందని నెహ్రూ గారు సగర్వంగా ప్రకటన చేశారు. కావున తల్లిదండ్రులు మరియు గురువులు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ధితే దేశం అన్ని విధాలుగా బలపడి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందని ఎన్నడూ మరువరాదు.
Q1. నవంబర్ 14 యొక్క ప్రాముఖ్యత ఏమిటి | What is the November 14 special in India?
A.
బాలల దినోత్సవాన్ని ‘బాల్ దివాస్’ అని కూడా పిలుస్తారు, ప్రతి సంవత్సరం నవంబర్ 14న భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశం యొక్క మొదటి ప్రధాన మంత్రి, చాచా నెహ్రూ అని ప్రసిద్ధి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని స్మరించుకుంటుంది.