సామెతలు | Funny Quotes In Telugu For Friends
- అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని.
- ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు.
- ఐశ్వర్యానికి అంతం లేదన్నట్లు.
- ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా !
- ఒక చెయ్యి తట్టితే చప్పుడు అవుతుందా!
- ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
- ఇంటిలో ఈగల మోత బయట పల్లకి మోత.
- ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు.
- ఇంట్లో పులి వీధిలో పిల్లి.
- ఈతకాయతో తాటికాయ.
- అదిగో తోక అంటే ఇదిగో పులి.
- అందితే సిగ అందకపోతే కాళ్లు .
- అడవిలో కాచిన వెన్నెల ముదిమిని చేసిన పెళ్లి.
- అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తే వాడోకడు .
- ఉడత ఊపులకు కాయలు రాలునా?
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
- ఎంత వారలైన కాంతదాసులే.
- ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య.
- ఎద్దు పుండు కాకికి ముద్దా!
- ఎర్రను చూపి చేపను లాగినట్టు.
- ఎవరి వెర్రీ వారికి ఆనందం.
- ఎవరికి వారే యమునా తీరే.
- ఎద్దును అడిగా గంత కట్టేది?
- ఏ ఎండకి ఆ గొడుగు ఏ గాలికి ఆ చేప.
- ఏకు అయి వచ్చి మేకు అయిన తీరు.
- కొరివితో తల గోక్కున్నట్టు.
- కన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ.
- కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడ్డట్టు.