Podupu Kathalu in Telugu | పొడుపు కథలు
.
Here are the 20 best Podupu Kathalu in Telugu with answers:
పొడుపు కథలు
- తెల్లని పోలీసుకు నల్లని టోపీ.
- రెండిల్లకు ఒకే దూలం.
- తోకలేని పిట్ట తొంబై ఆమడ పోవును.
- ముడిస్తే మొగ్గ, విప్పుతే పువ్వు.
- తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నాలు.
- నోరు లేని పిట్ట తోకతోని నీల్లు తాగును.
- కాళ్ళు ఉండి కదలలేనిది.
- కళ్ళు ఉండి చూడలేనిది.
- రెక్కలుంటాయి కానీ ఎగురలేదు.
- అందరూ నన్ను తినటానికి కొంటారు కానీ నన్ను ఎవరూ తినరు.
- నేను శుబ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికి పడితే తెల్లగా ఉంటాను.
- అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మీ ఇంటికి వచ్చాను తైతక్కలాడాను.
- కిట కిట తలపులు కిటాయి తలపులు ఎంత మూసిన తెరచిన చప్పుడు కావు ఏంటవి?
- పండ్లు ఉంది కూడా నమలలేనిది.
- ఊపుతే ఊగుతాయి కాని పీకుతే రావు ఏంటవి?
- అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం పోతాయి.
- గదినిండా ముత్యాలు గదికి తాళము.
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లం.
- నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?
- పొట్టివానికి పుట్టెడు అంగీలు.
జవాబులు :
- అగ్గిపుల్ల
- ముక్కు
- ఉత్తరం
- గొడుగు
- పనస పండు
- దీపం
- కుర్చి
- కొబ్బరికాయ
- ఫ్యాను
- పల్లెము
- బ్లాకు బోర్డు
- చల్లకవ్వము
- కనురెప్పలు
- దువ్వెన
- చేతివేళ్ళు
- పెదవులు
- దానిమ్మ పండు
- తేనెతెట్టే
- ప్రపంచ పటము
- ఉల్లి గడ్డ