చీమ – పావురము | Ant and Pigeon story

Ant and Pigeon Moral Story (Cheema Pavuram) in Telugu in Telugu for Children:
ఒక ఊరి పక్కన ఒక చెరువు ఉండేది. ఆ చెరువులోని నీటిలో చీమ పడి ఉన్నది ఆ చీమ ఎంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు రాలేకపోయింది.
నీటి కదలికకు అటు ఇటు పోతున్నది. పక్కనే చెట్టుపైన ఒక పావురము ఉన్నది. చీమ కష్టాన్ని చాలా సేపటినుండి చూస్తున్నది.
చీమను చూసి దానికి చాలా బాధ వేసింది. జీవన్ ఎలాగైనా చీమను ఇలాగైనా రక్షించాలని అనుకున్నది.
వెంటనే చెట్టు ఆకులు తెంపి చీమ దగ్గర పడేటట్టు నీటిలో వేసింది. మెల్ల మెల్లగా ఆకు పైకి ఎక్కింది చీమ.
నీటి కదలికకూ ఆకు ఒడ్డుకు వచ్చినది. ఆకుతో చీమ కూడా వచ్చినది. బతుకు జీవుడా అనుకున్నది చీమ.
కొన్ని రోజుల తర్వాత ఆహారం కొరకు తిరుగుతున్న చీమకు ఒక వేటగాడు కనిపించాడు. అతడు చెట్టు పై ఉన్నా పావురమును చంపడానికి బాణం గురిపెట్టాడు.
అది చూసిన చీమ వేటగాడి వద్దకు పోయి, అతని కాలిపై కరిచింది. దానితో వేటగాడు గురి పెట్టిన బాణం దారి మరలింది.
అంతలో వేటగాడిని గమనించిన పావురం ఎగిరిపోయింది. దాని ప్రాణాలు దక్కించుకుంది. చీమ పావురం ఎగిరి పోవడం చూసి సంతోష పడినది.
ఈ కథలోని నీతి:
తాను సహాయం పొందడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయవలెను.