Mudu Chepala Katha | Three Fishes Story in Telugu
Mudu Chepala Katha Telugu Moral Story / మూడు చేపల కథ:
ఒక ఊరి లో మంచి నీటి చెరువు ఉండే ది. దానిలో కొన్ని చేపలు ఉండే వి, వాటిలో మూడు చేపలు చాలా స్నేహం గా ఉండే వి.
అవి సుమతి, కాలమతి, మందమతి. అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండే వి.
ఈ చేపలు చెరువు లో ఈదు కుంటూ హాయిగా కాలం గడిపేవి.
సుమతి ముందుచూపు తో రాబోయే ఆపద నుండి కాపాడుకో వాలి అనుకునేది. కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది. మందమతి పేరుకు దిగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది.
ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యా యి ఎండల తీవ్రత కు చెరువు లోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి.
రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఎండలకు చెరువు లోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివర లో ఉన్న పెద్ద చెరువు లోకి వెళదాము లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు.
వారికి మనం సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి. సుమతి మాటలకు కాలమతి, మందమతి హేళన గా నవ్వారు.
అప్పుడు సుమతి, వాటి కర్మ కు వాటిని వదిలేసి పెద్ద చెరువు లోకి వెళ్లి పోయింది.
సుమతి ముందుగా ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల తాకిడికి నీళ్లు తగ్గిపోయాయి. కొన్ని నీళ్లు ఉండగానే జాలర్లు అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు.
ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి. కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా ఉంది వలలో.
జాలరి కాలమతి ని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు అని చెరువులోకి విసిరాడు. బతుకు జీవుడా అనుకుని కాలమతి.
మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది. ఆ చేపలు ఇంటికి తీసుకొని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి.
Moral of the story:
ఆ పదాలను గుర్తించి సమయస్ఫూర్తితో బయట పడాలి.
అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాలనుండి తప్పించుకోవాలి. అలా కానప్పుడు మందమతి లాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే .
It is so nice