దొంగ – గుర్రం | Thief and Lazy Horse story in Telugu
దొంగ – గుర్రం / Lazy Horse story in Telugu:
బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని సీతయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు.
దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు. నేను మాత్రం బానిస లాగా బతకాల్సి వస్తోంది.
ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూట కట్టుకున్నాడు.
జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది. యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళుతున్న దొంగను, “అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పండి” అన్ని బతిమిలాడింది గుర్రం.
నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది.
దానికి దొంగ నవ్వుతూ “నేను దొంగను, దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు. నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీ లాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు”.
“యజమాని పైన విశ్వాసం లేని వారు ఇప్పటికైనా ముంపు” అన్నాడు దొంగ.
వెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది. అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది.
నీతి:
నమ్మకము విశ్వాసము మనలను కాపాడును