గురుసందేశం | A Story of Guru’s Message

ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచం పెద్డ మొక్క, మూడవది దానికన్న కొంచం పెద్దది. నాల్గవది చాలా పెద్ద చెట్టు.
గురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి ధానిని కూడా లాగేసాడు. మూడవదానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు “చూడు నాయినా! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మనై వంగునా? అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు” అన్నాడు గురువుగారు.
గురుసందేశం నీతి: మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి.
Nice, such a wonderful Stories, keep posting.