పిచ్చుక సాహసం కథ | Story of Sparrow Adventure
Pichuka Samudrudi Katha in Telugu with Moral:
కథ:
ఒక బుల్లి పిట్టా సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసుకుని మురిసిపోయింది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది.
ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను అలలే లా గు కపోయాయి అని అర్థమైంది పిచ్చుకు.
వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకొంది పిచ్చుక.
సముద్రుడు చెలిచకపోవడంతో పిట్ట కోపంగా “నీ నీళ్లన్నీ తో డేస్తా అని శపధం చేసింది పిట్ట”. వెంటనే పిట్టా తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది.
అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపక నవ్వాయి. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు.
ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది. ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్య పడ్డాడు తన వంతు సహాయం చేద్దామని పిట్ట వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు.
పిల్లల కోసం సముద్రుడి తో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను నేను నీకు సహాయం చేయాలనుకుంటున్న అని చెప్పాడు గరుత్మంతుడు.
అతని మాటలకు సంతోషించింది పిచ్చుక, గరుత్మంతుడు భీకర స్వరంతో “మిత్రమా! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి” అని హెచ్చరించాడు. దీంతో సముద్రుడు భయపడ్డాడు.
గరుత్మంతుని తరుపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అని అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పిట్ట ఆనందముతో ఎగిరింది.
ఈ కథలోని నీతి|Moral of the Story:
చిన్నదైనా ధైర్యంతో పని చేసింది ఫలితం వచ్చింది.