తెలివైన మేక | Intelligent Goat Story
ఒక అడవిలో కొన్ని మేకలు మేత మెస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పై నుండి మెల్లగా వెళ్లాలి ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటు వైపు వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలులేదు. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చినాను అంటే నేను వచ్చినని అని రెండు పోట్లాడుకుంటున్నాయి. మోదటి మేకకు చినప్పుడు తల్లిమేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తువచ్చింది. వెంటనే మోదటి మేక, రెండవ మేకతో “ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. కావున ఇద్దరం క్షేమంగా కలువ దాటాలంటే నేను మెల్లిగా కూర్చుంటాను నీవు నాపై నుంచి దాటి వెళ్ళు” అని చెప్పింది. రెండవ మేక సరేనని మేకపైనుండి దూకివెళ్లింది. రెండు మేకలు క్షేమంగా కలువ దాటాయి.