బంగారు గొడ్డలి | Golden Axe Story Moral in Telugu
Bangaru Goddali Katha in Telugu
ఒక ఊరిలో ఆశయ కాశయ్య అనే స్నేహితులు ఉండేవారు. కాశయ్య తన పని కష్టపడి చేసుకునేవాడు. ఆశయ బద్దకస్తుడు.
కాశయ్య రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని తెచ్చి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు.
సూర్యోదయం తోనే లేచి గొడ్డలి చేత పట్టుకొని అడవికి బయల్దేరాడు కాశయ్య. ఒక పెద్ద చెట్టును చూచి అక్కడికి వెళ్లాడు.
ఈ చెట్టుకు చాలా కట్టెలు కొట్టుకోవచ్చు అనుకున్నాడు, చెట్టు ఎక్కి కట్టెలు కొడుతుండగా గొడ్డలి జారీ కిందనే ఉన్న చెరువులో పడింది.
అప్పుడు కాశయ్య బాధపడుతూ చెరువులోని గంగమ్మ తల్లిని ప్రార్థించాడు. కాశయ్య ప్రార్థనకు మెచ్చి గంగమ్మ తల్లి ప్రత్యక్షమైంది.
“ఓ మానవ నన్ను ఎందుకు వేడుకొనుచున్నావు.” అని అడిగింది గంగమ్మ తల్లి.
అప్పుడు కాశయ్య నా విలువైన గొడ్డలి జారీ చెరువులో పడినది. నా గొడ్డలి నాకు ఇవ్వు నా గొడ్డలి నాకు ఇవ్వు.
వెంటనే గంగమ్మ చెరువులో మునిగి బంగారు గొడ్డలి చూపించింది. “ఆ గొడ్డలి నాది కాదు” అన్నాడు కాశయ్య.
మళ్లీ వెండి గొడ్డలి చూపించింది అది నాది కాదు అన్నాడు. నాది ఇనుప గొడ్డలి అన్నాడు కాశయ్య.
అప్పుడు గంగమ్మ చెరువులో నుండి ఇనుప గొడ్డలి తెచ్చింది ఈ గొడ్డలి నాది అన్నాడు కాశయ్య.
నీ నిజాయితీ కి మెచ్చి నీకు మూడు గొడ్డ ల్లను ఇస్తున్నాను బహుమతిగా అన్నది గంగమ్మ తల్లి.
మూడు గొడ్డళ్ళూ తీసుకొని ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు కాశయ్య.
భార్యతో చెబుతున్నప్పుడు చాటుగా విన్నాడు ఆశయ్య. నేను కూడా బంగారు గొడ్డలి తెచ్చుకోవాలి అనుకొని ఒక ఇనుప గొడ్డలి తీసుకుని చెరువు దగ్గరకు పోయి గొడ్డలిని చెరువు లో పడేశాడు.
నాకు గొడ్డలి ఇవ్వమని గంగమ్మను ప్రార్థించాడు. వెంటనే గంగమ్మ ఇనుప గొడ్డలి ని చూపించింది, ఇది నాది కాదు అన్నాడు ఆశయ్య.
వెండి గొడ్డలి చూపించింది, ఇది నాది కాదు అన్నాడు. బంగారు గొడ్డలి చూపించింది, అమ్మా ఈ గొడ్డలి నాది అన్నాడు.
వెంటనే అతని దుర్బుద్ధి తెలుసుకున్న గంగమ్మ ఈ రెండూ నీవి కావు, నీది ఇనుప గొడ్డలి నీవు అత్యాశ పరుడవు.
నీ ఇనుప గొడ్డలి తీసుకుని కష్టపడి బతుకు ఇనుప గొడ్డలి ఇచ్చి వెళ్ళిపోయింది గంగమ్మ. ఏడ్చుకుంటూ ఇంటి దారి పట్టాడు ఆశయ్య.
కాశయ్య ఆ బంగారు గొడ్డలి ని డబ్బు గా మార్చుకొని సంతోషంగా బతుకుతున్నాడు.
ఈ కథలోని నీతి|Moral of the Story:
దురాశ దుఃఖానికి చేటు, అత్యాశ వలన అందలము ఎక్కలేవు.