ఏడు చేపల కథ | seven fishes story |
Yedu Chepala Katha
అనగనగా విక్రమశ అనే రాజు గారు ఉండేవారు. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు. ఒకరోజు రాజకుమారులు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు.
రాజకుమారులు ఒక్కొక్కరు ఒక చేపని పట్టుకున్నారు. అయితే, ఆ చేపలను ఇంటికి తీసుకొని వెళ్లి ఎండలో పెట్టారు. ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు.
అప్పుడు రాజకుమారుడు ” చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు” అని అడిగాడు.
“గడ్డివాము ఎండకు అడ్డం వచ్చింది” అని అన్నది చేప.
“గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు” అని రాజకుమారుడు అడిగాడు.
“ఆవు నన్ను తినకుండా వదిలేసింది” అని అన్నది గడ్డివాము.
రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి “గడ్డివాము తినలేదు ఎందుకు” అని అడిగారు.
యజమాని నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు.
యువరాజు యజమాని దగ్గరికి వెళ్లి “ఆవుకి ఎందుకు గడ్డి వేయలేదు” అని అడగగా. నాకు మా అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వెయ్యలేదు అని చెప్పాడు.
యువరాజు అవ్వను అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగగా “మా ఇంట్లో నా మనుమడు ఏడుస్తున్నాడు” అని చెప్పింది అవ్వ.
మనుమడు దగ్గరికి వెళ్లి “ఎందుకు ఏడుస్తున్నావు” అడగగా, చీమ నన్ను కొట్టింది అని అన్నాడు.
అప్పుడు యువరాజు “ఎందుకు కుట్టావు చీమ” అని అడిగాడు. దానికి బదులుగా చీమ “నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా” అని చెప్పింది.
this post is awesome!