కామాక్షి మీనాక్షి

కథ
లక్ష్మాపురం అనే ఊరిలో కామాక్షి మీనాక్షి అనే వారు ఇరుగుపొరుగు ఇళ్ల వారు. మీనాక్షి పొదుపు గల ఇల్లాలు కామాక్షి బద్దకస్తురాలు. మీనాక్షి కి రెండు పాడి గేదెలు ఉండేవి ఆ పాలతో పెరుగు నెయ్యి చేసుకుంటూ కుటుంబానికి సహాయపడేది.
కామాక్షి ఆరు పాడి గేదలు ఉండేవి కానీ ఆ పాలతో పెరుగు నెయ్యి చేసేది కాదు. ఒకరోజు కామాక్షి ఇంటికి బంధువులు వచ్చారు వారికి నెయ్యి వడ్డీ ఇద్దామనుకుంటే ఇంట్లో నెయ్యి లేదని పొరుగింటి మీనాక్షి వద్దకు వెళ్లింది. వదిన మా ఇంటికి బంధువులు వచ్చారు కొంచెం నెయ్యి బదులు ఇవ్వు నాలుగు రోజుల్లో తిరిగి ఇస్తానంది కామాక్షి. సరే వదినగారు అని ఒక గిన్నెడు నెయ్యి తెచ్చి ఇచ్చింది మీనాక్షి.
వారం రోజులు గడిచినా కామాక్షి నెయ్యి ఇవ్వలేదు సరికదా ఆరు గేదలు ఉన్న నేను రెండు గేదెలు ఉన్న నీ దగ్గరికి నెయ్యి కి వచ్చాన అని బదలాయించింది కామాక్షి. వెంటనే కామాక్షి ఆ ఊరి కరణం గారి వద్దకు వెళ్లి మీరే తీర్పు చెప్పాలి అని మీనాక్షి నెయ్యి అడిగిన విషయం చెప్పింది.
అప్పుడు కరణంగారు ఇద్దరినీ పిలిపించి నాకు జ్వరంగా ఉంది నాలుగు రోజుల తర్వాత ఇద్దరు రండి, వచ్చేటప్పుడు పాతచింతకాయ పచ్చడి తీసుకుని రండి అని ఒక గాజు పాత్ర ఇచ్చారు కరణం గారు. సరేనని ఇద్దరూ వెళ్లి నాలుగు రోజుల తర్వాత మీనాక్షి గాజుపాత్రలో పాత చింతకాయపచ్చడి తెచ్చింది, కామాక్షి వేరొక పాత్రలో కొత్త చింతకాయ పచ్చడి తో వచ్చింది.
కరణం గారు ఇద్దరినీ పిలిచి ఆ పాత్రను చూపిస్తూ మీనాక్షి పొదుపుతో పాత చింతకాయ పచ్చడి దాచి పెట్టింది, గాజు పాత్రలో జాగ్రత్తగా తెచ్చింది. నీలో పొదుపు లేదు అజాగ్రత్తతో గాజు పాత్ర పగిలినది కొత్త పచ్చడి తెచ్చావు. నీకు ఆరు గేదెలు ఉన్న పొదుపు చేయలేదు, కాబట్టి నీ వద్ద నెయ్యి లేదు అన్నాడు కామాక్షి తో. మీనాక్షి కి నెయ్యి ఇప్పించాడు ఆ కరణం గారు.
ఈ కథలోని నీతి
పొదుపు లేకపోతే ఎంత సంపద అయిన వృధా.