Shivaratri Festival Story In Telugu
మహాశివరాత్రి:
హిందూ ధర్మం ప్రకారం తెలుగువారి పండుగలలో శివరాత్రి ఒక పండగ.ఈ పండగ ఆధ్యాత్మికమైన పండగ.
ఈ రోజంతా శివ నామస్మరణ, ఉపవాసం, అభిషేకం, జాగరణతో గడుపుతారు. శివుడు లింగోద్భవం జరిగిన రోజే, ఈ శివరాత్రి జరుపుకుంటారు.
లింగోద్భవం:
లింగోద్భవం గురించి ఒక పురాణ కథ ఆచరణలో ఉంది, అది
పూర్వము బ్రహ్మ, విష్ణువుల లో ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. ఆ వివాదం ఎన్ని రోజులకు వారిరువురూ శివుని దగ్గరికి వెళ్లారు.
ఆ సమయములో ప్రళయ కర్త అయిన శివుడు గొప్ప లింగ ముగా ఆవిర్భవించాడు అట. ఆ మహా శివలింగమే ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీనితో వారిరువురికి కనువిప్పు కలిగింది.
నాగభూషణదారి పరమేశ్వరుడు లింగము గా ఆవిర్భవించినది ఈరోజు నే అని మహాశివరాత్రి జరుపుకుంటారు.
ఈరోజు ఉపవాసం జాగరణ సనాతన సాంప్రదాయ గా వచ్చింది.
శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎందుకు:
మృత్యువును దరిచేరని అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీర సాగర మధనం ప్రారంభించారు.
అలా చిలుకుతుండగా ముందుగా హలాహలం పుట్టింది, ఆ హలాహలం సర్వనాశనం చేస్తుంటే దేవదానవుల తో పాటు బ్రహ్మ విష్ణువులు కైలాసం లో ఉన్నా శివుని వద్దకు వెళ్లి కాపాడుమని ప్రార్థిస్తారు.
అప్పుడు శివుడు ఆ గరళాన్ని తాగి తన కంఠంలో ఉంచుకుని గరళకంఠుడు అవుతాడు.
ఆ గరళం వలన కంఠము నీలంగా మారుతుంది దీనితో శివుని నీలకంఠుడు గా పిలుస్తారు.
ఆ గరళం శివునిలో విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉన్నందున శివునికి నిద్ర రాకుండా దేవతలు రాక్షసులు అందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడారట.
ఆరోజు మాఘ బహుళ చతుర్దశి వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్ని శివరాత్రి జాగరణ కాలముగా అనుకుంటారు.
ఆ రోజు నుండి ఏటా మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజునే మహాశివరాత్రి జరుపుకుంటాము.
మహాశివరాత్రి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయం కు వెళ్లి అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని పండ్లు ఆహారంగా తీసుకుంటారు.
2020 లో మహా శివరాత్రి తేదీ / Maha Shivaratri Date in 2020:
This year Shivaratri is celebrated on 21 February on Friday.