Republic Day Speech In Telugu For Students
Ganatantra Dinotsavam in Telugu/గణతంత్ర దినోత్సవం తెలుగులో:
ముందుగా మన అందరికీ గణతంత్ర దినోత్సవ (రిపబ్లిక్ డే) శుభాకాంక్షలు. భారతదేశ చరిత్రలో జనవరి 26 1950వ సంవత్సరం భారతీయులం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు.
200 సంవత్సరాలపాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితం గా ఆగస్టు 15 1947 సంవత్సరమున మన దేశానికి స్వాతంత్రము వచ్చినది.
అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మన దేశం నుండి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించు కోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.
అలా 1950వ సంవత్సరం జనవరి 26న రాజ్యాంగాన్ని నిర్మించబడి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశం గా రూపుదిద్దుకుంది.
ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వం గా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.
1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు అయినది. అనేక సవరణల అనంతరం 1949 భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలములో పూర్తిచేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము గా గుర్తింపు పొందినది.
ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ గారు అన్నారు.
ప్రజాస్వామ్యానికి మూలగ్రంథం లాంటిది మన రాజ్యాంగం అలాంటి మన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) గా జరుపుకుంటాము.
మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి హిందీలో ఒకటి మరొకటి ఇంగ్లీషులో ఉన్నాయి. ఆ ప్రతులు పాడవకుండా ఉండడానికి హీలియం వాయువును నింపిన కేసులలో పార్లమెంట్ పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు.
వాటి నకలు ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మన రాజ్యాంగం 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ ఉదయం 10:18 నిమిషములకు అమలులోనికి వచ్చినది.
అప్పటినుండి ఈ రోజును గణతంత్ర దినోత్సవం గా గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన దేశ రాజధానిలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవముగా జరుగుతాయి.
ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన వారికి పథకాలను అందిస్తారు.
ఈ రోజును పురస్కరించుకొని దేశ రాజధానిలో నూ రాష్ట్ర రాజధాని లోనూ గొప్ప గొప్ప పరేడ్ లను నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుండి ఎంతోమంది విద్యార్థులు ఈ పరేడ్లో పాల్గొంటారు.
దేశ రాజధానిలో నూ రాష్ట్ర రాజధాని లోనూ పట్టణాలలోనూ పాఠశాలలోనూ పల్లెల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగరవేసి వందనము చేస్తారు.