What is Coronavirus in Telugu | కరోనా వైరస్ అంటే ఏమిటి
కరోనా వైరస్:
ఇప్పుడు ప్రపంచ ప్రజలను గడగడ వణికిస్తున్న వైరస్ పేరే కరోనా వైరస్.
ఇంతకుముందు చికెన్గున్యా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా ఇలా రకరకాల వైరస్లతో ప్రజలు బాధపడుతున్నారు.
ఇప్పుడు ఈ కరోనా వైరస్ చైనాలోని వుహన్ అనే ప్రాంతంలో ప్రారంభమైంది. ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు పాకుతుంది.
ఈ కరోనా వైరస్ అతి వేగంగా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ పాములు నుండి గబ్బిలాల నుండి ఈ వైరస్లు వ్యాప్ ఇస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.
ఈ వ్యాధి సోకిన వారి లక్షణాలు:
జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం విరేచనాలు తో బాధపడతారు. ఈ వైరస్ తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో ఉన్నవారికి వేగంగా వ్యాపిస్తుంది. కావున, ఈ ఇబ్బంది ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కరోనా వైరస్ చిన్న పిల్లలకు, ముసలి వారికి తొందరగా సోకే అవకాశం ఉంది.
నీరసంగా ఉన్నప్పుడు, జలుబు చేసినప్పుడు జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది.
పై లక్షణాలు ఉన్న వారందరికీ కరోనా వైరస్ ఉన్నట్టుగా నిర్ధారించుకో వద్దు.
వైద్యుని సలహా మేరకు పరీక్షలు చేయించుకొని మందులు వాడుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
ఈ వ్యాధి సోకకుండా మాస్కు ధరించాలి చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. దగ్గినా తుమ్మినా చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. వేడి వేడి ఆహారం తినాలి. శీతల పానీయాలు తీసుకోవద్దు
ఆయుర్వేదం ప్రకారం వేడిని కలిగించే పదార్థాలు వెల్లుల్లి , మిరియాలు, అల్లం, తులసి మొదలగు పదార్థాలను మొదలగు పదార్థాలను ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవాలి.
చైనాలోని పరిస్థితి:
వుహన్ల్లో మన భారతీయ విద్యార్థులు ఉన్నారు వారిని మన దేశానికి రప్పించడానికి మన భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం లో తీసుకురావడానికి చర్యలు తీసుకుంది.
ఇప్పటికే చైనాలో వేల మందికి ఈ వైరస్ సోకింది వందల మంది చనిపోయారు అని తెలుస్తుంది.
అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి నీ ప్రకటించింది. దానితో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి.
ముఖ్య గమనిక:
ఒక పది తులసి ఆకులను నూరి ఆ రసాన్ని ఒక లీటరు గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగుతుండాలి.
Good article.
Very much useful.