ఉగాది | Ugadi In Telugu

ఉగాది | Ugadi In Telugu
Spread the love

“ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు”

 

 తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. యుగం అంటే యోగమని మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు.  ఉగాది రోజు నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండగ. ఇది వసంతకాలంలో వస్తుంది. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ విశేషంగా జరుపుకుంటారు. 

ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్ర లేచి, తలంటు స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, అలంకరించి, ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనందిస్తారు. వసంత లక్ష్మిని స్వాగతిస్తారు.

ఉగాది పచ్చడి / Ugadi Pachadi

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. అంటే ఆ ఆరు రుచులు తీపి – సంతోషానికి, చేదు – బాధకి, కారం – కోపానికి, ఉప్పు – భయానికి, పులుపు – చిరాకుకి, వగరు – ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత / Ugadi Pachadi Significance

ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పచ్చు అని కూడా చెబుతుంటారు కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువగాని తక్కువగాని అవ్వకుండా అన్ని సమపాళ్లల్లో ఎంతో జాగ్రత్తగా చేస్తారు వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

తెలుగువారు ఉగాదినాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలుపెడతారు. పంచాంగ శ్రవణం అంటే ఐదు అంగాలు అని అర్థం చెబుతారు ఇందులో తిధి ద్వారా నక్షత్ర యోగం కరణం అని 5 అంగాలు ఉంటాయి ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం.  వరుసగా ఇవి మానవునికి సంపద ఆయుషు పాపప్రక్షాళన వ్యాధి నివారణ గంగా స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. 

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. సాయంకాలం కవులు ఒకచోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు ఇందులో కవితలు పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. 

తెలుగులో ఉగాది పచ్చడి పదార్థాలు /Ugadi Pachadi Ingredients in Telugu

  1. చింతపండు – పుల్లని రుచి
  2. బెల్లం – తీపి రుచి
  3. పచ్చి మామిడి – చిక్కగా
  4. వేప పూలు – చేదు రుచి
  5. నల్ల మిరియాలు – కారంగా
  6. ఉప్పు – ఉప్పు రుచి

–> In 2023 Ugadi is celebrated on March 22.

Sudha

Sudha is a homemaker. Her knowledge in Telugu literature and passion for writing has influenced her to start this blog with the help of her son. She uses to tell a story at the night to her son daily. Now her idea is to share all the stories in this blog for children.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© Copyright 2020 - Telugu Stories