కార్తీక మాసం విశిష్టత | Kartika Masam
కార్తీక మాసం విశిష్టత | Kartika Masam
Kartika Masam Start Date: Monday(సోమవారం), October 10
Kartika Masam End Date: Tuesday(మంగళవారం), November 8
కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్రము దగ్గరిలో ఉంటే కార్తీక మాసం అంటారు. దీపావళి మరుసటి రోజైన పాడ్యమి నుండి కార్తీక మాసం ప్రారంభమగును. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం 2022 అక్టోబరు 26 బుధవారం నుండి నవంబరు 23 బుధవారం వరకు కార్తీక మాసం.
కార్తీక మసానికి కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు చెపుతారు. కార్తీక స్నానము, శివాలయ దర్శనము, అభిషేకం, దీపారదన, దీపదానం, ఉపవాసం, శివపురాణం చదువుట లేద వినుట. “ఓం నామ: శివాయ” పంచాక్షరీ మంత్ర పారాయణం చేయుటవలన పరమశివుని అనుగ్రహం కలుగునని శివపురాణం చెపుతుంది.
చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, పాడ్యమి తిథులు, సోమవరములలో ప్రత్యేక పూజలు చేస్తారు. మన దేశంలోని శివాలయాలలో రుద్రాభిషేకాలు, బిల్వభిషేకాలు, భక్తులతో కీటకిటలాడుతాయి. కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటారు.
స్నానము :సూర్యోదయం కంటె ముందే నది, బావి, ఇంటిలో ఎవరి వీలుని బట్టి వారు స్నానము ఆచరిస్తారు.
దీపము : మట్టి, పిండి ప్రమిదలలో, ఇంటిలో, తులసి చెట్టు, ఉసిరి చెట్టు, గుడి ఆవరణలో, నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తారు. సంవత్సరము మొత్తము దీపాలు పెట్టని వారు 365 వత్తులతో దీపాలు వెలిగిస్తే ప్రతి రోజు దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది అని నమ్మకం. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే రోజు దీపారదన చేసిన పుణ్యము కలుగునని నమ్మకం.
దానం : ఎవరి శక్తి మేరకు వారు బ్రాహ్మణులకు దీపదానం, పేదలకు వస్త్రదానాలు చేస్తారు.
ఉపవాసం : కార్తీక మాసం అంటే ఉపవాసాలకు పేరు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా రోజంతా ఉపవాసం ఉంది రాత్రి చంద్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. నెల రోజులు చేయలేని వారు, సోమవారం, ఏకాదశి, పౌర్ణమి రోజులలో ఆచరించినచో పరమశివుని అనుగ్రహం కలుగునని పెద్దలు చెపుతారు.
ఆకాశదీపం : కార్తీక మాసం ప్రారంబపు రోజు నుండి సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంబముపై వెలిగించిన దీపాన్ని ఉంచుతారు.
జ్వాలాతోరణం : కార్తీక పౌర్ణమి నాడు రాత్రి దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాలలో రెండు కర్రెలను నిలువుగా మరొక కర్రను అడ్డముగా కట్టి తోరణములాగా కొంత ఎండు గడ్డిని కట్టి నెయ్యిని పోసి మంటను వెలిగిస్తారు. దీని కిందనుండి పార్వతి పరమేశ్వరుల పల్లకీని తిప్పుతారు. జ్వాల కింది నుండి వెళ్ళిన వారికి యమలోక బాధ ఉండదు అని పురాణ కథ.
వనభోజనం : పచ్చటి చెట్ల మధ్య, ప్రకృతి సౌందర్యములో, బందుమిత్రులతో, ఇరుగుపొరుగు వారితో కలిసి “శివ” నామస్మరణతో ఉసిరి చెట్టు కింద అరటి ఆకుల భోజనం ఆరోగ్యదాయకం.
మన తెలుగు రాష్ట్రాల్లో “భక్తి టివి” యాజమాన్యం కార్తీక మాసంలో “కోటి దీపోత్సవం” అంగరంగ వైభవంగా దీపాలంకరణతో, దేవతామూర్తుల కళ్యాణం, ప్రవచనాలతో, శివ నామ స్మరణతో మారుమోగుతుంది.