హోలీ పండుగ విశిష్టత | Importance of Holi festival
హోలీ పండుగ / Holi Essay in Telugu
పురాణాల ప్రకారం హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ ఒక పండుగ.. ఈరోజు బంధువులు, స్నేహితులు, ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ గడుపుతారు.. చిన్న, పెద్ద తేడా లేకుండా కోలాటాలు ఆడుతూ, నృత్యాలు చేస్తూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.. ఈ పండుగను హోలీ పండుగ, కాముని పూర్ణిమ అని కూడా అంటారు.. ఈ పండుగను తెలుగు నెలలోని సంవత్సరంలోని పాల్గొనమాసం లో వచ్చేపౌర్ణమి రోజు జరుపుకుంటారు..
కామ దహనం:: పార్వతీదేవి శివున్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది.అందుకు మన్మధుని సహాయం కోరి శివుని తపస్సు భంగం చేయస్తుంది. మన్మధుడు శివునిపై కామ భవనం వేస్తాడు.. కోపంతో శివుడు మూడో కన్ను తెరుస్తాడు.. కామదేవుడు దహనం అవుతాడు.. ఆనాటి నుండి వాడవాడలా మంటలు వేసి కామ దహనం చేసి, చెడు దహించి, మంచి కలగాలని కోరుకుంటారు ..
వైష్ణవ పురాణాల ప్రకారం పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ చేత వరం పొందాలనుకుంటాడు.. తనను చంపడం ఎవరికి సాధ్యం కాకుండా వరం పొందుతాడు.. పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శాస్త్రములు, వలన గాని చావు లేకుండా వరం కోరుతాడు.. అందుకు బ్రహ్మ అంగీకరించి రాక్షస రాజైన హిరణ్యకశ్యపునికి కోరుకున్న వరం ఇస్తాడు.. ఈ వరంతో హిరణ్యకషపునికి దురహంకారం పెరిగి స్వర్గము, భూమిపై దాడి చేస్తాడు.. ప్రజలు ఎవ్వరు దేవుళ్లను పూజించకుండా తననే పూజించాలని బాధలు పెడతాడు.. హిరణ్యకశ్యపుడు
ఇంత దురహంకారంతో ఉంటే అతని కుమారుడు ప్రహల్లాదుడు తండ్రికి వ్యతిరేకంగా విష్ణువుని భక్తితో పూజిస్తాడు.. కొడుకు విష్ణు భక్తిని తెలుసుకున్న హిరణ్యకశ్యాపుడు విష్ణునామం చేయవద్దని హెచ్చరిస్తాడు.. తండ్రి మాటలు వినకుండా విష్ణువుని పూజిస్తున్నాడు ప్రహ్లాదుడు.. కోపంతో హిరణ్యకశ్యాపుడు ప్రహల్లాదున్ని చంపాలని నోట్లో విషం పోస్తాడు.. ప్రహల్లాదునికి విష్ణు మాయ తో అమృతంగా మారుతుంది.. ఏనుగులతో తొక్కిస్తాడు, పాములతో కరిపిస్తాడు, ప్రహ్లాదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా విష్ణు అనుగ్రహంతో ఎలాంటి హాని జరగదు.. చివరి ప్రయత్నం గా తన కూతురైన హోలీకా ఒడిలో కూర్చొని మంటల్లో ఉండాలని ప్రహల్లాదునికి తండ్రి హిరణ్యకశ్యాపుడు ఆజ్ఞాపిస్తాడు.విష్ణు భక్తితో తన సోదరి హోలీక ఒడిలో కూర్చొని చితిపై కూర్చుంటాడు. అదే సమయంలో ప్రహ్లాదునికి హాని జరగకుండా విష్ణు మాయతో హోళిక కప్పుకున్న దుప్పట తొలగి ప్రహల్లాదని రక్షిస్తుంది. క్రూరమైన ఆలోచనలతో ఉన్న హిరణ్యకశపుని కూతురూ హోలికా ఆ మంటల్లో సజీవ దహనం అవుతుంది. ఇలా హోలీక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు. హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తుతాడు.. బ్రహ్మచే వరం పొందినందుకు భిన్నముగా సగం మనిషి సగం జంతువు(సింహం) లాగా సంధ్యా సమయంలో అంటే పగలు రాత్రి కాకుండా ఇంటి లోపల ఇంటి బయట కాకుండా కడపపై భూమి మీద ఆకాశంలో కాకుండా ఒడిలో కూర్చోపెట్టుకొని రాక్షస రాజైన హిరణ్యకశపుని చంపుతాడు.హోలీ పండుగకు మరో కథ కూడా ఉన్నదని పురాణాల ద్వారా తెలుస్తోంది..శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడని రాధా వెక్కిరిస్తుందని ఆమె రాధకు రంగులు పూయాలని చెపుతోంది రాధాకృష్ణులు గోపికలు ప్రేమగా ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా ఆటపాటలతో గడుపుతార.