ఉపాయం | Idea
కథ
ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం ఇష్టముండేది కాదు. ఏదో విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు, రకరకాల జంతువుల శబ్దాలు చేస్తూ రాత్రిలో ఊరంతా తిరిగేవాడు. అతని గోలకి ఎవరూ సరిగా నిద్ర పోయే వారు కాదు.
రామయ్యకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని ఊరివారంతా నిర్ణయించుకున్నారు, ఒకరోజు ఊరివారు రామయ్యకు సన్మాన సభకు రావలసినదిగా కబురు పంపారు. ఆ విషయం రామయ్యకు అర్థం కాక ఆలోచనల నిమగ్నమయ్యాడు. అదే దారి గుండా పింకీ అనే పాప వెళుతుండగా రామయ్య సన్మాన సభ గురించి చెప్పాడు.
అప్పుడు పింకీ రామయ్యతో నీవు చేసే జంతువుల శబ్దాలవలన ఎలాంటి దొంగల భయం లేకుండా ప్రశాంతంగా నిద్ర పోతున్నారు అని అందుకే నీకు సన్మానం చేయాలని అనుకున్నారు అని చెప్పింది.
ఎదుటి వారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని రామయ్య ఆరోజు నుండి ఎలాంటి శబ్దాలు చేయడం లేదు, దీనితో ఊరివారు ప్రశాంతంగా నిద్రపో గలిగారు.
ఈ కథలోని నీతి: ఆలోచన తో ఏ పనైనా సులువుగా చేయవచ్చు అని తెలుసుకున్నాము.